1134 movie trailer | గంగాధర్‌రెడ్డి, ఫని శర్మ, ఫని భార్గవ్, కృష్ణ మదుపు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘1134’. శరత్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ధుని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఏటీఎం దొంగతనాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
వరుస ఏటిఎం దొంగతనాలతో సిటీ పోలీస్‌లను పరిగెత్తిస్తున్న మిస్టీరియస్ రాబరీ గ్యాంగ్ అంటూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.ఒకరికి ఒకరు తెలియదు అలా ఓ ముగ్గురున్నారు. వాళ్లు కొన్ని దొంగతనాలు చేశారు. తెలిసి తెలియకో వాళ్లే తెలుసుకున్నారు. నలుగురవుతారు అప్పుడు వాళ్ళను పట్టుకోవడమే నీ పని అంటూ పలికే సంభాషణలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో అన్నీ నువ్వనుకుకేలా జరిగితే మరి నేనెందుకురా అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆథ్యంతం థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.