సోమవారం జరిగే నామినేషన్ ప్రక్రియ ఎంత వాడివేడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 11వారం నామినేషన్ ప్రక్రియలో బాటిల్లో ఉన్న ద్రవాన్ని నామినేట్ చేసే వ్యక్తులపై పోసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. సన్నీ మెడలో గిల్టీ ట్యాగ్‌ను తొలగించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. మొదటగా కెప్టెన్ రవి.. తనను ఫేక్ అనడం నచ్చలేదంటూ సన్నీని, సన్నీని రెచ్చగొట్టిందంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు.
కాజల్ ఇంటి నుండి వెళ్లిపోతే గొడవలు తగ్గిపోతాయనే కారణం చెప్పి ఆమెను నామినేట్ చేశాడు షణ్ముఖ్. ప్రియాంక సింగ్‌ని నామినేట్ చేశాడు. ఇక మానస్.. షణ్ను, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. శ్రీరామ్.. మానస్, సన్నీని నామినేట్ చేశాడు. కాజల్ .. అనీ మాస్టర్, షణ్ముఖ్‌లని నామినేట్ చేసింది. సిరి.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ప్రియాంక సింగ్ తనకు సపోర్ట్ చేయలేదని, మానస్ గేమ్ కూడా తానే ఆడుతోందంటూ నామినేట్ చేసింది. సిల్లీ రీజన్స్ ఇవ్వకంటూ కాజల్ తలపై బాటిల్లోని ద్రవాన్ని గుమ్మరించింది.
ప్రియాంక సింగ్.. సిరి, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది. సన్నీ.. శ్రీరామ్,సిరిని నామినేట్ చేశాడు. అనంతరం అనీ మాస్టర్ వంతు రాగా.. నేను మా ఫ్యామిలీని మిస్ అవుతున్నానని హగ్ చేశాను. కానీ హగ్ పాయింట్‌ను ఇలా బయటకు తీసుకువచ్చి నామినేట్ చేయడం నచ్చలేదంటూ మానస్ తలపై బాటిల్ గుమ్మరించింది. ఆ తర్వాత కాజల్‌ను నామినేట్ చేస్తూ వెక్కిరించింది.ఇలా వెక్కిరించడాన్ని అగౌరవపరచడం అంటారు అని కాజల్ అనగా, అది అవమానించడం అని ఏ ఒక్కరితో అనిపించినా ఆ రోజు నేను నీ కాళ్లు మొక్కుతాను, అది కూడా సాష్టాంగ నమస్కారం చేస్తానని శపథం చేసింది.
మొత్తానికి 11వ వారంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఉన్న 9మందిలో 8మంది నామినేట్ అయ్యారు. కెప్టెన్‌గా ఉన్న రవి ఒక్కడు మాత్రం సేవ్ అయ్యాడు. గత వారం మాదిరిగా ఈ వారం ఎవరినైన సేవ్ చేస్తారా అన్నది చూడాలి.