Salaar Trailer | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్ (Salaar) ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 1న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
‘నీకోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా.. నీ ఒక్కడికోసం.. నువ్వెప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా.. అంటూ పవర్ఫుల్ డైలాగ్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ ప్రభాస్ అభిమానులకు గూజ్బంబ్స్ తెప్పిస్తుంది. ఇక కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేసిన ఈ ట్రైలర్ తాజాగా యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతుంది.
𝟏𝟎𝟎 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐞𝐰𝐬 𝐅𝐨𝐫 #SalaarTrailer 🔥💥https://t.co/n1ppfmkpoI#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/520rB0vFqP
— Hombale Films (@hombalefilms) December 2, 2023
తాజాగా సలార్ పార్ట్-1ట్రైలర్‌కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 100 మిలియన్ల (10కోట్లు)కు పైగా వ్యూస్ దాటాయి. ఈ వంద మిలియన్ వ్యూస్ మార్కును 24 గంటలు గడవకముందే ట్రైలర్ దక్కించుకుంది. ఈ విషయాన్ని హొంబాలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.