Samyuktha Menon | భీమ్లానాయక్, బింబిసార వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ సుందరి సంయుక్త మీనన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం సంయుక్త మీనన్ ప్రయోగాత్మక కథాంశంతో రూపొందించనున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నట్లు తెలిపింది.
యోగేష్ దర్శకుడిగా పరిచయమయ్యే ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మించనున్నారని సమాచారం. కథలోని కొత్తదనం నచ్చడంతో సంయుక్త మీనన్ ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పిందని, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.