టాలీవుడ్ నటి హరితేజ ఇంట బుజ్జిపాపాయి సందడి మొదలైంది. హరితేజ సోమవారం రాత్రి పండంటి పాపాయికి జన్మనిచ్చింది. హరితేజ తనకు కూతురు పుట్టిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. అఆ, హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. 28 ఏండ్ల హరితేజ 2015లో దీపక్ ను పెండ్లి చేసుకుంది. మొక్కపై పూలతో డిజైన్ చేయబడ్డ చిట్టి చెప్పులను పెట్టి గతంలో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హరితేజ పలు టీవీ షోలకు యాంకరింగ్ చేసింది.
మనసు మమత, రక్తసంబంధం, అభిషేకం సీరియల్స్ తోపాటు వివిధ ఛానళ్లలో ప్రసారమయ్యే ధారవాహికల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టంట్‌గా అలరించింది. బిగ్ బాస్ సీజన్ 4లో గెస్ట్ గా హాజరైంది. సమంత నటించిన యూ టర్న్ చిత్రంలో, ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రాల్లో కీ రోల్స్ లో కనిపించింది. వీటితోపాటు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది.
ఇవి కూడా చదవండి
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్