కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశి జంటగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నేడు కిరణ్ అబ్బవరం జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. ‘మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేది నా కథ..ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా’ అంటూ టీజర్ ఆసక్తికరమైన సంభాషణతో సాగింది.
కిరణ్ అబ్బవరం క్స్ కొత్తగా ఉన్నాయి. ‘కుటుంబ కథా చిత్రమిది. హృదయాల్ని తడిమే భావోద్వేగాలుంటాయి’ అని చిత్రబృందం తెలిపిది. సెప్టెంబర్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డేనియల్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్, దర్శకత్వం: మురళీ కిషోర్.