హైదరాబాద్, ఆగస్టు 7: రాష్ర్టానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ జెన్ టెక్నాలజీస్ అంచనాలకుమించి రాణించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.7.46 కోట్ల లాభంతో పోలిస్తే ఎన్నో రేట్లు పెరిగినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 3.5 రెట్లు పెరిగి రూ.37.07 కోట్ల నుంచి రూ.132.45 కోట్లకు చేరుకున్నది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..డ్రోన్ల ఆర్డర్లు పుంజుకోవడం, విదేశాల్లో కూడా అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందన్నారు.