ఏండ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా నిష్క్రియంగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును తిరిగి ఇప్పటికీ పొందవచ్చు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖాతాదారులకు సహాయం చేస్తున్నది. ఖాతాలోని నగదు పదేండ్లకుపైగా అలాగే ఉంటుంటే ఆ సొమ్ము.. ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్లో ఉండవచ్చు. దీన్ని క్లెయిం చేసుకోవడానికి ఇలా ప్రయత్నించండి.
చివరగా..
పిల్లల భవిష్యత్తు కోసం పెద్దవాళ్లు (తల్లిదండ్రులు) బ్యాంక్ ఖాతాల్లో తమ కష్టార్జితాన్ని దాచడం, డిపాజిట్లు చేయడం సహజమే. అయితే దురదృష్టవశాత్తు డిపాజిట్దారులు చనిపోతే ఆ సొమ్ము గురించి వారసులకు తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు బ్యాంక్ ఖాతాలు, డిపాజిట్లకు సంబంధించిన ఏ సమాచారమున్నా ఆయా బ్యాంక్ వెబ్సైట్లలో వెతకవచ్చు. ఆర్బీఐ ఉద్గమ్ పోర్టల్ https://udgam.rbi. org.inలో నూ చూసుకోవచ్చు. ఈ డిసెంబర్దాకా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఆర్బీఐ ప్రత్యేక శిబిరాలనూ నిర్వహిస్తున్నది. వీటి ద్వారా కూడా మన సొమ్మును మనం తిరిగి పొందే అవకాశాలున్నాయి.