Used Cars | భారత్‌లో ఇప్పుడు యూజ్డ్ కార్ స్పేస్ ఆకర్షణీయంగా మారుతున్నది. క్రమంగా అభివృద్ధి చెందుతున్నది. వివిధ వెరైటీ ఆప్షన్లలో కొనుగోలుదారులు తమకు ఇష్టమైన.. నచ్చిన మోడల్ ఎంచుకోవడమే కాదు.. కొత్త కారును మరిపించేలా అందుబాటులో ఉన్నాయి యూజ్డ్ కార్లు. దశాబ్దం క్రితం నాటి పాతకాలపు డిజైన్లతో కూడిన కాలం చెల్లిన మోడల్‌కు బదులు న్యూ మోడల్ కార్లలోనే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయొచ్చు. తక్కువ రేటుకే వర్జినల్ కండీషన్లో ఉన్న కారును కొనుగోలు చేయొచ్చు. ఐదేండ్ల క్రితం కొనుగోలు చేసిన పెట్రోల్ వేరియంట్ హ్యాచ్ బ్యాక్ కార్లు కొన్ని చూద్దాం.. రూ.4 లక్షల్లోపు ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
2016లో టాటా మోటార్స్ తొలుత టాటా టియాగోను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. నాటి నుంచి దేశంలోని హ్యాచ్‌బ్యాక్ క్యాటగిరీ కార్లలో మెరుగైన సేల్స్ నమోదవుతున్న కారు టియాగో. ఇప్పుడు పూర్తిగా విస్తరించిన ఫీచర్లతో 2017లో అందబాటులోకి వచ్చింది టాటా టియాగో రెవోట్రోన్ ఎక్స్‌టీ. ఇంపాక్ట్ డిజైన్ 2.0 కింద రూపుదిద్దుకున్న ప్రీ ఫేస్ లిఫ్టెడ్ టియాగో మార్కెట్ దృక్పథాన్నే మార్చేసింది. ఇంతకుముందు టాటా మోటార్స్ సంప్రదాయ మోడల్ కార్ల డిజైన్‌కు ఇది భిన్నం. పుణె, తురిన్, కోవెంట్రీల్లోని టాటా మోటార్స్ డిజైన్ సెంటర్ల నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా టియాగో రూపుదిద్దుకున్నది. రూ.2.23 లక్షల నుంచి రూ.2.37 లక్షల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంది. హ్యుమానిటీ లైన్ క్రోమ్‌తో న్యూ హానీకోంబ్ గ్రిల్లే ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చిన తొలి కారు ఇది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో పెట్రోల్ లేదా డీజిల్ పవర్ ట్రైన్‌తో అందుబాటులో ఉంది. 55 వేల నుంచి 65 వేల కి.మీ. మేర నడిచిన కార్లు అందుబాటులో ఉన్నాయి.
హోండా కార్స్ ఇండియా ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ బ్రియో. 2019లో అందుబాటులోకి వచ్చింది. ఇది చౌక ధరకు లభించడమే కాదు పవర్ఫుల్ ఇంజిన్లతో అందుబాటులో ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ పెద్ద మోడల్స్, విస్తరించిన ఫీచర్లతో కూడిన బ్రియో హ్యాచ్ బ్యాక్ కారు కోసం ప్రాధాన్ంయ ఇస్తున్నారు. 1.2 లీటర్ల ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో తొలుత అందుబాటులోకి వచ్చింది. 88బీహెచ్పీ పవర్ సామర్థ్యంతో 109 ఎన్ఎం టార్చీ వెలువరిస్తుంది. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్లతలో లభ్యం అవుతుంది. వీఎక్స్ ఎంటీ వేరియంట్లోనూ తీసుకోవచ్చు. తొలిసారి కారు ఓనర్ కావాలనుకునే వారికి ఇది సూటబుల్‌గా ఉంటుంది. 25 వేల నుంచి 35 వేల కి.మీ. దూరం ప్రయాణించిన ఈ కారు రూ.3.09 లక్షల నుంచి రూ.3.28 లక్షల మధ్య ధర పలుకుతున్నది.
దేశంలోని అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో మోడల్ కారుకు హ్యుండాయ్ వారి ఎవోన్ ఎరా ప్లస్ తొలిసారి సవాల్ విసిరింది. హ్యుండాయ్ ఎవోన్ ఎరాప్లస్ 2011లో మార్కెట్లోకి వచ్చింది. అట్రాక్టివ్ ఇంటీరియర్స్, ఫ్లూడిక్ లుక్స్‌తో కనిపించే ఎవోన్ ఎరా ప్లస్ కారు 1.0 లీటర్లు, 3-సిలిండర్ ఇంజిన్ సామర్థ్యంతో వచ్చింది. కప్పా 2 ఫ్యామిలీతో అప్డేట్ చేశారు. స్పేసియస్ క్యాబిన్, వెల్రౌండెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఈ కారులో అత్యంత పవర్ఫుల్ ఏసీ యూనిట్లు ఉన్నాయి. ఫ్యూయల్ ఎఫిషియెంట్ కూడా. 35 వేల నుంచి 40 వేల కి.మీ. మధ్య తిరిగిన ఈ కారు రూ.2.23 లక్షల నుంచి రూ.2.37 లక్షలకే వినియోగదారులకు లభిస్తుంది.
చిన్న హ్యాచ్‌బ్యాక్ మోడల్‌తోపాటు తేలిగ్గా డ్రైవ్ చేసుకుని వెళ్లగల వెసులుబాటు ఉన్న మోడల్ కారు రెనాల్ట్ క్విడ్. స్పేసియస్ క్యాబిన్‌తోపాటు యూజ్డ్ కారైనా తొలిసారి కారు కొనుగోలు చేసే వారికి బెటర్ ఆప్షన్. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈజీగా డ్రైవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వర్షన్లో సాఫిస్టికేటెడ్ గేర్ బాక్స్, అత్యంత ప్రమాణాలతో కూడిన విడి భాగాలు ఉంటాయి. ఎస్యూవీ మోడల్ కారును తలపిస్తుంది. రేర్ పార్కింగ్ కెమెరా ఆప్షన్‌తోపాటు తక్కువ ధరకే హై ఎండ్ ఫీచర్లను అందిస్తున్నది. రెనాల్ట్ క్విడ్‌లో ఆర్ఎక్సటీ మోడల్ కారుకు రీ సేల్ వాల్యూ ఉంది. 25 వేల నుంచి 35 వేల కి.మీ. మధ్య నడిచిన ఈ కారు రూ.2.09 లక్షల నుంచి రూ.2.21 లక్షలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.