న్యూఢిల్లీ : యమహా ఇండియా ఆర్15 వీ3 న్యూవెర్షన్‌ను సింగిల్ సీట్‌తో యూనిబాడీ పేరిట లాంఛ్ చేసింది. ఈ బైక్ రూ 1.57 లక్షలకు (ఎక్స్‌షోరూం) అందుబాటులో ఉంటుంది. రేసింగ్ బ్లూ కలర్లో లభించే ఈ బైక్ స్టాండర్డ్ ఆర్15, వీ4 కంటే రూ 13,000 తక్కువకు కస్టమర్ల ముందుకొచ్చింది.
ఆర్15 వీ3 వేరియంట్ 155సీసీ, 4-స్ర్టోక్, లిక్విడ్ కూల్డ్, వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఆర్15 రేసింగ్ డీఎన్ఏతో రాజీపడకుండా అందుబాటు ధరలో బైక్‌ను అందించాలనే లక్ష్యంతో ఆర్15 వీ3 యూనిబాడీ సీట్‌ను లాంఛ్ చేశామని యమహా మోటార్ ఇండియా గ్రూప్ చీఫ్ షిటర పేర్కొన్నారు.