హోం లోన్లు ఇక్కడ అగ్గువ!
- వడ్డీ భారమెంత.. రుణ అర్హత, ప్రీ-ఈఎంఐ సౌకర్యాలేమిటి?
వడ్డీరేట్ల పెంపుతో గృహ రుణాల భారం తడిసి మోపెడవుతున్నది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కీలక వడ్డీరేట్లను తగ్గించి రుణగ్రహీతలకు సుదీర్ఘకాలం ఉపశమనాన్ని కలిగించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ద్రవ్యోల్బణం అదుపు పేరుతో అవే వడ్డీరేట్లను వరుసగా పెంచుతూపోతున్నదిప్పుడు. ఫలితంగా రెపో రేటు 0.9 శాతం ఎగబాకగా, బ్యాంకులూ రుణాలపై వడ్డీరేట్లను ఇంతే మేర పెంచేస్తున్నాయి. దీంతో రుణాల ఈఎంఐలు పెరగడం, రుణాలు చెల్లించే సమయం ఎక్కువవడం జరుగుతున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం గృహ రుణాలపై తక్కువ వడ్డీరేట్లను వసూలు చేస్తున్న బ్యాంకులేవి.. వడ్డీరేట్ల పెంపుతో ఈఎంఐలపై పడుతున్న భారమెంత.. ఇంటి విలువలో రుణం ఎంతవరకు తీసుకోవచ్చు.. ప్రీ-ఈఎంఐ ప్రయోజనాలేంటో చూద్దాం.
ఈఎంఐలు ఎంత పెరుగుతాయ్?
రెపో రేటును ఆర్బీఐ రెండుసార్లు పెంచగా, 0.9 శాతం పెరిగింది. దీంతో ఈ మేరకు బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలూ తమ గృహ రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఫలితంగా రుణగ్రహీతల ఈఎంఐలూ పెరుగుతున్నాయి. ఉదాహరణకు.. 7 శాతం వార్షిక వడ్డీరేటుపై ఇంకా 20 ఏండ్లపాటు రూ.30 లక్షల గృహ రుణాన్ని మీరు చెల్లించాల్సినైట్టెతే ఈ వడ్డీరేట్ల పెంపుతో మీ ఈఎంఐ రూ.1,648 పెరుగుతుంది. అంటే నెలసరి వాయిదా మొత్తం రూ. 23,259 నుంచి రూ.24, 907కు ఎగబాకుతుంది. ప్రతీ లక్ష రూపాయలకు దాదా పు రూ.55 చొప్పున ఈఎంఐ ఎక్కువైందన్నమాట.
ఎంతవరకు రుణం తీసుకోవచ్చు?
చాలా బ్యాంకర్లు, హౌ జింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇల్లు లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ విలువలో 75 నుంచి 90 శాతం వరకు రుణంగా అందిస్తున్నాయి. మీ జీతం, లేదా మీ ఆదాయాన్నిబట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది. ఆస్తి విలువను రూ.50 లక్షలుగా లెక్కిస్తే రూ.40 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. తీసుకునే రుణం రూ.75 లక్షల లోపుంటే ఆస్తి విలువలో 80 శాతం వరకు రుణంగా ఇచ్చేందుకు రుణదాతలు ఆసక్తి చూపుతున్నారు.
ప్రీ-ఈఎంఐ చెల్లింపులు
ప్రీ-ఈఎంఐ అనేది మీ గృహ రుణానికి సంబంధించి చేసే నెలసరి వడ్డీ చెల్లింపులు మాత్రమే. ఈ చెల్లింపుల్లో అసలు ఉండదు. ఇల్లు లేదా అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉన్నప్పుడు వాటి కోసం రుణాలు తీసుకుంటే ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. సదరు నిర్మాణం పూర్తయ్యి గృహ ప్రవేశం చేసిన తర్వాత సాధారణ హౌజింగ్ లోన్ ఈఎంఐలను మొదలుపెట్టవచ్చు. అప్పటిదాకా మీరు తీసుకున్న గృహ రుణానికి ఈ ప్రీ-ఈఎంఐ పద్ధతిలో నెలనెలా వడ్డీ మొత్తాలను చెల్లిస్తే సరిపోతుంది. అద్దె ఇండ్లలో ఉంటూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారికి ఈ ప్రీ-ఈఎంఐ లాభదాయకంగా ఉంటుం ది. గృహ రుణంపై కేవలం వడ్డీ చెల్లింపులే ఉంటాయి కాబట్టి ఈఎంఐ తక్కువగా ఉంటుంది. ఫలితంగా అద్దెల భారాన్ని రుణగ్రహీ తలు అధిగమించవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- finance
- Pre-EMI
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

