Wipro CEO Thierry Delaporte | విప్రో సీఈఓ డెలాపోర్టే రాజీనామా.. కొత్త సీఈఓగా శ్రీనివాస్ పాల్లియా
Wipro CEO Thierry Delaporte | దేశీయ ఐటీ దిగ్గజం ‘విప్రో’ కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంస్థ సీఈఓగా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే రాజీనామా చేశారు
Wipro CEO Thierry Delaporte | దేశీయ ఐటీ దిగ్గజం ‘విప్రో’ కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంస్థ సీఈఓగా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. డెలాపోర్టే స్థానంలో శ్రీనివాస్ పాల్లియాను విప్రో కొత్త సీఈఓగా నియమిస్తున్నట్లు ధ్రువీకరించింది. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి సీఈఓగా థెర్రీ డెలాపోర్టే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు విప్రో డైరెక్టర్ల బోర్డు తెలిపింది. గత నెల 31 నుంచి డెలాపోర్టే రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది.
అజీం ప్రేమ్ జీ ఆధ్వర్యంలోని విప్రో సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా థెర్రీ డెల్లాపోర్టె 2020 జూలై నుంచి కొనసాగుతున్నారు. భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈఓగా ఆయన నిలిచారు. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తర్వాత స్థానంలో విప్రో నిలుస్తుంది. డెలాపోర్టే వేతనం రూ.82 కోట్లకు పైగా వేతనం అందుకున్నారని విప్రో తెలిపింది. విప్రోలో సీఈఓగా పని చేయకముందు థెర్రీ డెలాపోర్టేకు ఐటీ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఫ్రాన్స్ ఐటీ సంస్థ క్యాప్ జెమినీ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పని చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

