BharatPe | ఉద్దేశపూర్వక దుర్వినియోగాన్ని సహించం:భారత్‌పే
BharatPe | భారత్‌పేలో ఉద్దేశపూర్వకంగా మోసాలకు, దుర్వినియోగానికి పాల్పడితే సహించం అని సెక్యూయియా హెచ్చరించింది.
BharatPe | ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పేలో దుర్వినియోగం, దుష్ప్రవర్తన, ఫ్రాడ్‌పై సంస్థ ఇన్వెస్టర్ సెక్యూయియా క్యాపిటల్ ఘాటుగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రవర్తనకు పాల్పడినా, మోసానికి పాల్పడిన కఠినంగా స్పందిస్తామని ఆదివారం తేల్చి చెప్పింది. ఎటువంటి తప్పిదాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత్ పేలో సిక్యూయియా క్యాపిటల్ అతిపెద్ద వాటాదారు. భారత్ పే సహ-వ్యవస్థాపకుడిగా అశ్నీర్ గ్రోవర్‌ను వర్చువల్‌గా ఆయన విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సంస్థ వాటాదారులు, ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని సెక్యూయియా తన బ్లాగ్ పోస్ట్‌లో రాసుకుంది. ఆర్థికంగా ఖర్చైనా సరే వెనుకంజ వేసేది లేదని తేల్చేసింది. సంస్థ ప్రయోజనాలకు సరైన నిర్ణయం అని భావిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పరోక్ష వ్యాఖ్యలు చేసింది. కంపెనీలు విలువైనవిగా శాశ్వతంగా నిలువాలని కోరుకుంటున్నట్లు ఈ అమెరికా వెంచర్ క్యాపిటల్ సంస్థ తెలిపింది.
కొందరు పోర్ట్‌ఫోలియో ఫౌండర్లు మోసపూరిత పద్ధతులకు పాల్పడినట్లు, సుపరిపాలనా పద్దతులే పాటించలేదని ఇటీవల సంస్థ జరిపిన దర్యాప్తులో తేలిందని సెక్యూయీయా తెలిపింది. ఈ ఆరోపణలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని వివరించింది. ఫౌండర్లు సుదీర్ఘ కాలం సేవలందించాలని మేం ఎల్లవేళలా ప్రోత్సహిస్తుంటాం. శాశ్వతమైన విధానాలపైనే దృష్టి పెడతాం అని పేర్కొంది.
స్టార్టప్ వ్యవస్థకు కాపలాదారులు అవసరం కనుక తప్పు చేసే కొద్ది మంది ఫౌండర్లు భారీ ఎదురుదెబ్బలు తీయొద్దు అని స్పష్టం చేసింది. సంస్థ సహా వ్యవస్థాపకుడిగా అశ్నీర్ గ్రోవర్ ప్రారంభంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడన్న ఆరోపణలు వచ్చాయి. భారత్ పే అంతర్గత దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సంస్థ నుంచి ఆయనను బయటకు పంపించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Asneer Grover
- bharat pe
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

