WhatsApp | టెక్ట్స్ రూపంలో వాయిస్ మెసేజ్.. త్వరలో వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి..!
WhatsApp | వాట్సాప్ తన యూజర్లకు వచ్చే వాయిస్ మెసేజ్ లు వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకునేందుకు ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ తీసుకొస్తోంది.
WhatsApp | ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్ల కోసం రోజుకో అప్ డేటెడ్ ఫీచర్ తీసుకొస్తోంది. రోజువారీ పని మీద ప్రతి ఒక్కరూ ప్రయాణాలు చేస్తుంటారు. అలా ప్రయాణం చేస్తున్న వారందరికీ వాట్సాప్ గ్రూపుల్లో అదేపనిగా వాయిస్ మెసేజ్‌లు వస్తుంటాయి. అందరి వద్ద ఇయర్ ఫోన్లు అందుబాటులో ఉండక పోవడంతో ప్రయాణం ముగిసిన తర్వాత వాటిని వినడం సాధ్యం కాదు.. అటువంటి వాయిస్ మెసేజ్‌ల్లో తెలిపే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. టెక్ట్స్ రూపంలో వాయిస్ మెసేజ్ చూపే ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ తీసుకొస్తున్న వాట్సాప్.. ప్రస్తుతం దాన్ని ఆండ్రాయిడ్ బీటా వర్షన్ లో అందుబాటులో ఉంది.
అనునిత్యం వాట్సాప్ అప్ డేట్స్ అందించే వాబీటా ఇన్పో.. ఈ ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ ను గుర్తించింది. వాయిస్ మెసేజ్ వచ్చినా, పంపినా దాని కింద కనిపించే ట్రాన్స్ స్క్రిప్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. ఆ మెసేజ్ సారాంశం టెక్ట్స్ రూపంలో వస్తుంది. అయితే ఇదేమీ ట్రాన్స్ లేటర్ కాదు. వాయిస్ మెసేజ్ భాషలోనే టెక్ట్స్ మెసేజ్ వస్తుంది. ఇప్పటికైతే ఇంగ్లిష్, హిందీ, పోర్చుగస్, రష్యన్, స్పానిష్ భాషలకు సపోర్టుగా ఉంది. ఇతర భాషల్లోకి ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

