WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనునిత్యం యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తున్నది. అందులో భాగంగా ‘మెన్షన్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. మెటా అనుబంధ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్ లోడ్ చేసే టైంలో నచ్చిన వ్యక్తులను ‘@’ సాయంతో ట్యాగ్ చేస్తాం. అలా ట్యాగ్ చేయడం వల్ల ఆ వ్యక్తులకు మనం ఒక స్టోరీ పోస్ట్ చేసినట్లు నోటిఫికేషన్ వెళుతుంది. వారు కూడా నోటిఫికేషన్ చూడగానే మనం పోస్ట్ చేసిన స్టోరీ చదువుతారు. ఇటువంటి సదుపాయమే వాట్సాప్ కూడా తీసుకొచ్చింది. ఇక వాట్సాప్ యూజర్లు స్టేటస్ పెడుతున్నప్పుడు కాంటాక్టుల్లో నచ్చిన వ్యక్తుల్ని ట్యాగ్ చేయొచ్చు.
వాట్సాప్‌లో స్టేటస్ అప్ లోడ్ చేస్తున్నప్పుడు ‘యాడ్ క్యాప్షన్’ అనే బార్‌కు కుడి వైపు ‘@’ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ లోని కాంటాక్టులన్నీ కనిపిస్తాయి. వాటిల్లో మీకు నచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్లను మెన్షన్ చేస్తే సరి.. అలా మెన్షన్ చేసిన వారి ఫోన్ నంబర్లకు నోటిపికేషన్ వెళుతుంది. కానీ, ఇన్ స్టాలో మాదిరిగా ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదని వాట్సాప్ తెలిపింది. యూజర్ల గోప్యతకు భంగం వాటిల్ల కుండా వాట్సాప్ ఈ ఫీచర్ డిజైన్ చేసింది.