Crypto Investments | ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్.. క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్ నడుస్తోంది. క్రిప్టో కరెన్సీల్లో లీడింగ్ టోకెన్స్ బిట్ కాయిన్, ఎథీరియం గతేడాది పలు ఒడిదొడుకులకు గురయ్యాయి. పలు గరిష్ఠ, కనిష్ఠ రికార్డులు నమోదు చేశాయి. బిట్ కాయిన్ గత నవంబర్ 10న ఆల్‌టైం రికార్డు స్థాయిలో గరిష్ఠంగా 68,789 డాలర్లను తాకింది. గతేడాది జనవరి ఒకటో తేదీన ఇదే బిట్ కాయిన్ 28,803 పాయింట్లకు పతనమైంది. ఏతావాతా గతేడాది బిట్ కాయిన్ 138 శాతం లాభ పడింది. ఇక రెండో స్థానంలో ఉన్న ఎథీరియం.. నవంబర్‌లో ఎథీరియం 4,426.74 డాలర్లను తాకింది. క్రిప్టో కరెన్సీల మార్కెట్లో నూతన రికార్డులు నమోదయ్యాయి. కొత్త టోకెన్లు పుట్టుకొస్తూ విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్-5 క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్, వాటిల్లో 2022లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏది బెస్ట్ అనేది ఓ లుకేద్దాం..
ఇప్పటికీ అన్ని డిజిటల్ టోకెన్స్‌లో బిట్‌కాయిన్‌దే ఆధిపత్యం. సోమవారంకల్లా బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8111 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. పలు ఒడిదొడుకులకు గురైన బిట్ కాయిన్ సెప్టెంబర్‌లో కనిష్ఠంగా 40 వేల డాలర్ల దిగువకు పడిపోయి.. నవంబర్ 10న సరికొత్త ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. డచెస్ బ్యాంక్, జేపీమోర్గాన్ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థలు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే బిట్ కాయిన్‌ను డిజిటల్ గోల్డ్ అవతార్ అని అభివర్ణించాయి. ఒడిదొడుకుల మాటెలా ఉన్నా ఇన్వెస్టర్లలో బిట్ కాయిన్‌పై నమ్మకం యథాతథంగా కొనసాగుతున్నది.
గత ఏడాది కాలంలో క్రిప్టో కరెన్సీల్లో రెండో స్థానానికి చేరుకున్నది ఎథీరియం. కాయిన్ మార్కెట్ క్యాప్ డాట్ కామ్ గణాంకాల ప్రకారం సోమవారం కల్లా ఎథీరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ 390 బిలియన్ల డాలర్లు. ప్రూఫ్ ఆఫ్ వర్క్ (పీవోడబ్ల్యూ) నుంచి ప్రూప్ ఆఫ్ స్టేక్ (పీవోఎస్) స్థాయికి ఎథీరియం పరివర్తన చెందింది. 2022లో సుస్థిరంగా కొనసాగుతుందన్న పేరు సంపాదించుకుంది.
స్థిరంగా కొనసాగుతున్న క్రిప్టో టోకెన్ టెథర్ ఒకటి. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 78 బిలియన్ల డాలర్లు. అమెరికా డాలర్లు, యూరోల ప్రభావంతో ఒడిదొడుకులను తగ్గించుకోగలిగింది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో టోకెన్‌గా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బినాన్స్.. పరిమాణంలో ఇదే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్. 2017లో ట్రేడింగ్ ప్రారంభించినా శరవేగంగా విస్తరించింది. దాని నేటివ్ క్రిప్టో కరెన్సీ బినాన్స్ కాయిన్. 2017లో బినాన్స్ కాయిన్ విలువ 0.10 డాలర్లు. ఈ నెల మూడో తేదీ నాటికి దాని విలువ 52 వేల శాతం పెరిగి 520 డాలర్ల వద్ద నిలిచింది. సోమవారానికి బినాన్స్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 80 బిలియన్ డాలర్లు. క్రిప్టో టోకెన్లలో నాలుగో స్థానంలో నిలిచిందిది.
డాప్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అత్యధిక వేగంతో 65వేల టీపీఎస్ వద్ద ట్రాన్సాక్షన్ సాగింది సొలానా (ఎస్‌వోఎల్). ఎథీరియం కిల్లర్స్ గ్రూప్ నడుపుతున్న క్రిప్టో టోకెన్ ఇది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 54.82 బిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్లోకి వచ్చిన రెండేండ్లలోనే సుమారు 22 వేల శాతం విలువ పెంచుకున్నదిది. టోకెన్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు 0.77 డాలర్లతో మొదలైన సొలానా విలువ ఈ నెల మూడో తేదీన 171 డాలర్ల వద్ద స్థిర పడింది.
కార్డనో మార్కెట్ క్యాపిటలైజేషన్ 51 బిలియన్ల డాలర్లు. ప్రపంచ మార్కెట్లోని క్రిప్టో టోకెన్లలో ఆరో స్థానంలో ఉంది. క్రిప్టో ఇన్వెస్ట్లకు ఈ క్రిప్టో టోకెన్ గుడ్ ఛాయిస్. ఈ క్రిప్టో కరెన్సీ పీవోఎస్ మోడల్లో పని చేస్తుంది.