హైదరాబాద్, నవంబర్ 9: హైదరాబాద్‌కు చెందిన మానవ వనరుల స్టార్టప్ ‘కేక’ భారీ స్థాయిలో నిధులను సేకరించింది. సీరిస్-ఏ ఫండింగ్‌లో భాగంగా వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 57 మిలియన్ డాలర్ల(రూ.470 కోట్లు) నిధులను సమీకరించినట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో విజయ్ యలమంచలి తెలిపారు. సాస్ విభాగంలో ఇంతటి స్థాయిలో నిధులు సేకరించడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. 2016లో స్టార్టప్ సేవలను ఆరంభించిన సంస్థ..అనతికాలంలోనే దేశీయ, అంతర్జాతీయ కస్టమర్లను ఆకట్టుకున్నదని, ముఖ్యంగా 6,500 సంస్థలకు హెచ్ఆర్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిలో 90 శాతం సంస్థలు భారత్‌కు చెందినవి కావడం విశేషమన్నారు. మరోవైపు, ప్రస్తుతం సంస్థలో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాదికాలంలో ఈ సంఖ్యను రెట్టింపు 1,000కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.