RBI | భారతదేశ విదేశీక మారక ద్రవ్య నిల్వలు బలంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. నెలలు వస్తువులను ఎగుమతి చేసేందుకు ఈ నిల్వలు సరిపోతాయన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఇవి రక్షణగా ఉన్నాయని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సంయుక్తంగా ఆగస్టు 25, 26 తేదీల్లో ముంబయిలోని నారిమన్ పాయింట్‌లోని హోటల్ ట్రైడెంట్‌లో వార్షిక బ్యాంకింగ్ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో ఆయన ఆర్బీఐ గవర్నర్ పాల్గొని మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకు నియమాలు, నిబంధనలను సమీక్షించేందుకు రెగ్యులేటరీ రివ్యూ సెల్‌ను ఏర్పాటుపై మాట్లాడుతూ ప్రతిపాదిత సెల్ ప్రతి ఐదు-ఏడు సంవత్సరాలకోసారి అన్ని నిబంధనలను సమీక్షిస్తుందన్నారు.
ధరల్లో స్థిరత్వం, ఆర్థిక వృద్ధి లక్ష్యంతో సెంట్రల్ బ్యాంకు ద్రవ్య విధానాన్ని కొనసాగుతుందన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తామని.. ఇదే తమ ప్రాథమిక లక్ష్యమన్నారు. బ్యాంకు క్రెడిట్‌ను పెంచే చర్యలను ఆర్బీఐ పరిశీలిస్తోందన్నారు. నియంత్రిత సంస్థలు కస్టమర్ల ప్రయోజనం కోసం టెక్నాలజీలో పెట్టుబడి పెట్టాలని ఆర్బీఐ ఆశిస్తుందన్నారు. ప్రపంచంలో అస్థిరంగా మారిన ఆర్థిక వాతావరణంపై స్పందిస్తూ.. మనం దాన్ని దాటి సరిహద్దులను విసర్తించాల్సి ఉందన్నారు. బ్యాంకులు, కంపెనీలు కలిసి వచ్చి పెట్టుబడులు పెంచాలని కోరారు. దేశం అస్థిర ప్రపంచ ఆర్థిక వాతావరణం గుండా వెళుతోందన్నారు. అభివృద్ధి చెందుతున్న రంగాలతో సహా బ్యాంకు రుణాలను విస్తరించడానికి వంటి చర్యలను ఆర్బీఐ పరిశీలిస్తోందన్నారు.
భారతదేశ ఆర్థిక మధ్యవర్తిత్వం, సామర్థ్యం, ప్రభావాన్ని మెరుగుపరచడానికి నియంత్రిత సంస్థలతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని, ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూసుకోవాలని మల్హోత్రా పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధర స్థిరత్వం, ప్రాథమిక లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తుందన్నారు. మనం ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నామని.. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అస్థిర ప్రపంచ ఆర్థిక వాతావరణాన్ని ఎదుర్కొంటున్నామని.. వృద్ధి సరిహద్దులను మనం అధిగమించాలన్నారు. సవాళ్లను ఎదుర్కోవడానికి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలను పెంచాలన్నారు. ఏఐ, ఎంఎల్‌తో సహా కేంద్ర బ్యాంకులు సాంకేతికతను స్వీకరించడం కొనసాగిస్తాయని.. అన్ని నియంత్రిత సంస్థలు తమ, వారి క్లయింట్ల ప్రయోజనం కోసం ఈ టెక్నాలజీరంగంలో పెట్టుబడులు పెడుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.