Vivo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై28 (Vivo Y28) సిరీస్ ఫోన్లు వివో వై28ఎస్ (Vivo Y28s), వివో వై28ఈ (Vivo Y28e) ఫోన్లను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. న్యూ వివో వై28 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + 5జీ ప్రాసెసర్ తో పని చేస్తాయి. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.56 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. వివో వై28ఎస్ ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్852 ప్రైమరీ సెన్సర్ కెమెరా, వివో వై28ఈ ఫోన్ 13 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటాయి.
వివో వై28ఎస్ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,499 , 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999లకు లభిస్తాయి. వింటేజ్ రెడ్, ట్వింకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు వివో వై28ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999 పలుకుతుంది. బ్రీజ్ గ్రీన్, వింటేజ్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్ సైట్, ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.
వివో వై28ఎస్, వివో వై28ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తాయి. టీయూవీ రైన్లాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.56 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటాయి. 6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 5జీ ప్రాసెసర్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్లలో ర్యామ్ 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
వివో వై28 ఎస్ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 852 ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా కలిగి ఉంటుంది. వివో వై28ఈ ఫోన్ లో 13-మెగా పిక్సెల్ మెయిన్ కమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రెండు ఫోన్లలోని కెమెరాలు సూపర్ నైట్ కెమెరా మోడ్, లో లైట్ లేదా బ్రైట్ లైట్ కండిషన్ ఉన్నప్పుడు మల్టీ స్టైల్ పోర్ట్రైట్ మోడ్ లో ఉంటాయి.
వివో వై28ఎస్, వివో వై28ఈ ఫోన్లు రెండూ 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, మోటార్ అండ్ ప్రాగ్జిమిటీ సెన్సార్ కలిగి ఉంటాయి. వివో వై28ఎస్ ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. రెండు ఫోన్లూ 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. నాలుగేండ్ల పాటు బ్యాటరీ హెల్త్ ఉంటుందని వివో తెలిపింది.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
CMF Phone 1 | 50-ఎంపీ కెమెరా.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 ఆవిష్కరణ..!