Vivo X200 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్200 (Vivo X200), వివో ఎక్స్200 ప్రో (Vivo X200 Pro) ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. వివో ఎక్స్ 200ప్రో ఫోన్లో వీ3+ ఇమాజిన్ చిప్‌తోపాటు రెండు ఫోన్లలోనూ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. వివో ఎక్స్200 ఫోన్ లో 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, వివో ఎక్స్200 ప్రో ఫోన్ లో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. గత అక్టోబర్ నెలలో చైనా మార్కెట్లో ఈ ఫోన్ ఆవిష్కరించారు.
వివో ఎక్స్200 ప్రో ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.94,999 పలుకుతుంది. కాస్మోస్ బ్లాక్, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుందీ ఫోన్. వివో ఎక్స్200 ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.65,999, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.71,999 పలుకుతుంది. కాస్మోస్ బ్లాక్, నేచురల్ గ్రీన్ కలర్ షేడ్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం రెండు ఫోన్లు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెల 19 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. తొమ్మిది నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటది. రూ.9,500 వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్, రూ.9,500 ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు. ఏడాది వారంటీ పెంచుకోవచ్చు.
వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో పోన్లు ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 15 వర్షన్ పై పని చేస్తాయి. వివో ఎక్స్200 ప్రో ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల 1.5 కే రిజొల్యూషన్ (1,260×2,800 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఇక వివో ఎక్స్200 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల 1.5 కే రిజొల్యూషన్ (1280×2800 పిక్సెల్స్) అమోలెడ్ 8టీ ఎల్టీపీఎస్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. రెండు ఫోన్లూ 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి.
వివో ఎక్స్200 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ9400 ప్రాసెసర్, జీస్ బ్రాండెడ్ ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉంటాయి. వివో ఎక్స్200 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ-818 సెన్సర్ విత్ ఓఐఎస్ సపోర్ట్, 50-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ ఆటో ఫోకస్, 200-మెగా పిక్సెల్ టెలిఫోటో ఐసో సెల్ హెచ్‌పీ9 సెన్సర్ విత్ ఓఐఎస్ సపోర్ట్ అండ్ 3.7 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటాయి. ఇందులో వీ3+ ఇమేజింగ్ చిప్ ఉంటుంది.
వివో ఎక్స్200 ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్921 1/1.56అంగుళాల సెన్సర్ విత్ ఓఐఎస్ సపోర్ట్, 50-మెగా పిక్సెల్ జేఎన్1 సెన్సర్, 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 టెలిఫోటో సెన్సర్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫోన్లు ఉంటాయి. రెంటిలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బైదూ, గ్లోనాస్, క్యూజడ్ఎస్ఎస్, నేవిల్ సీ, ఏ-జీపీఎస్, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ-పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, కలర్ టెంపరేచర్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, ఫ్లిక్కర్ సెన్సర్, గైరో స్కోప్, లాటర్ ఫోకస్ సెన్సర్, ఇన్ఫ్రా రెడ్ బ్లాస్టర్ ఉంటాయి. అథంటికేషన్ కోసం రెండు ఫోన్లలోనూ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది. వివో ఎక్స్200 ప్రో ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, వివో ఎక్స్200 ఫోన్ 90 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటాయి.