Vivo V40 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ40 (Vivo V40) సిరీస్ ఫోన్లను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇందులో వివో వీ40, వివో వీ40 ప్రో ఫోన్లు ఉంటాయి. వివో వీ40 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తోంది. స్మూత్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కాంబినేషన్‌తో అందుబాటులో ఉంటది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 1260×2800 పిక్సెల్స్ రిజొల్యూషన్ తోపాటు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. స్మూతర్ స్క్రోలింగ్, గేమ్ ప్లేతో వస్తోంది.
వివో వీ40 ఫోన్ లో రెండు 50 మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి. వాటిలో ఒకటి వైడ్ యాంగిల్, వన్ ఆల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్లు డిటైల్డ్ ఫోటోలు, వైడ్ లాండ్ స్కేప్స్ తేలిగ్గా క్యాప్చర్ చేయొచ్చు. హై క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్, రేర్ కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్, క్లియర్ అండ్ క్రిస్ప్ వీడియోలకు మద్దతుగా ఉంటుంది.
వివో వీ40 సిరీస్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వీ14 విత్ ఫన్ టచ్ ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. స్టెల్లార్ సిల్వర్, నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ వీ 5.4, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ, యాక్సెలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్ తదితర సెన్సర్లు ఉంటాయి.