Vivo V30 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ30 ప్రో (Vivo V30 Pro)తోపాటు వివో వీ30 (Vivo V30) ఫోన్‌ను గత మార్చిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 (Qualcomm Snapdragon 7 Gen 3) ప్రాసెసర్, 80 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తున్న ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. వివో వీ30 (Vivo V30) ఫోన్ కొనసాగింపుగా ఈ నెల ఏడో తేదీన వివో వీ40 (Vivo V40) సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నది. ఈ నేపథ్యంలో వివో వీ30 (Vivo V30) సిరీస్ ఫోన్ల ధరలపై డిస్కౌంట్లు ప్రకటించింది.
వివో వీ30 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ర్యామ్ రూ.33,999 నుంచి రూ.31,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999 నుంచి రూ.33,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.37,999 నుంచి రూ.35,999లకు తగ్గించింది. ధరల తగ్గింపుతో అందుబాటులో ఉన్న వీవో వీ30 సిరీస్ ఫోన్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్సైట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. సెలెక్టెడ్ పార్టనర్ బ్యాంకు కార్డులపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్‌పై 8- నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. కొనుగోలుదారులకు వివో వీ షీల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ కింద అదనపు బెనిఫిట్లు పొందొచ్చు. అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వివో వీ30 ఫోన్ (Vivo V30) ఫోన్ 6.78 అంగుళాల కర్వ్డ్ 1.5 కే (2800 x 1260 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ వరకూ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది.
వివో వీ 30 (Vivo V30) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఔరా లైట్ ఫ్లాష్ యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.