Vivo T3x 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ గతేడాది ఏప్రిల్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వచ్చిందీ ఫోన్. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఉంటాయి. దీని లాంచింగ్ ధరపై రూ.1000 తగ్గిస్తున్నట్లు గురువారం వివో (Vivo) తెలిపింది. దీని ప్రకారం వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,499, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,499లకు లభిస్తాయి. క్రిమ్సోన్ బ్లిస్, సెలెస్టియల్ గ్రీన్, సఫైర్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుపై ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. రూ.4,167 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం అవుతుంది.
వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ (1080×2408 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. 4ఎన్ఎం బేస్డ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో పని చేస్తుంది. వర్చువల్ గా 8 జీబీ వరకూ ర్యామ్, మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 1.8 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ తో వచ్చింది.