Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!
Vivo T3 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Vivo T3 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తోందీ ఫోన్. వివో టీ3 5జీ ఫోన్ కొనసాగింపుగా వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ వస్తోంది.
వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,499, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499 పలుకుతుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా వెబ్ సైట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో వచ్చేనెల నాలుగో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే వివో టీ3 లైట్ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు.
వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ రెండు కలర్ ఆప్షన్లు – మేజిస్టిక్ బ్లాక్, వైబ్రంట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ (1612×720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. 6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తోంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ లో మరో 6జీబీ ర్యామ్ వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. ఏఐ బ్యాక్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ సెంటర్డ్ వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటది.
ఇవి కూడా చదవండి :
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్‌యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

