న్యూఢిల్లీ, జనవరి 22: వికాస్ లైఫ్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్..దుబాయ్‌కు చెందిన స్కై 2.0లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 79 మిలియన్ డాలర్లతో 60 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది. మన కరెన్సీలో ఇది రూ.650 కోట్లకు పైమాటే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ ఒప్పందం పూర్తికానున్నదని సంస్థ స్టాక్ మార్కెట్లకు సమాచారం అందించింది.