హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసిన వాసవి గ్రూపు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 40కి పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మించి కొనుగోలుదారుల మన్నలను పొందిన సంస్థ.. హైదరాబాద్ చుట్టు మరో 21 అతిపెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నది. రియల్ ఎస్టేట్ రంగంలో 29 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన ఈ గ్రూపు..మధ్యతరగతి స్థాయి నుంచి సంపన్న వర్గాలకు తమకు నచ్చిన విధంగా ఇండ్లను నిర్మిస్తున్నది. ఈ సందర్భంగా వాసవి గ్రూపు సీఎండీ ఎర్రం విజయ్ కుమార్‌తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూ..

ఎర్రం విజయ్‌కుమార్: నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా ఉండడానికి ప్రభుత్వం విధానాలు దోహదం చేస్తున్నాయి. బిల్డర్లు ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం టీఎస్ బీపాస్ పేరుతో అనుమతుల విధానాన్ని సరళీకృతం చేసింది. నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగినా ప్రభుత్వం బిల్డర్లను దృష్టిలో పెట్టుకొని పలు చర్యలు తీసుకున్నది. దీనివల్ల దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లోనే తక్కువ ధరకు ఇండ్లు లభిస్తుండటంతో ఇక్కడే కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
వి: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో మౌలికవసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంతి కేటీఆర్ దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగా చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఐటీ రంగంలో ఎక్కువగా ఉద్యోగాశాలు ఉండడంతో వారంతా సొంతింటి కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం వల్లే రియల్ ఎస్టేట్ మార్కెట్ కరోనా మహమ్మారి తట్టుకొని నిలబడగలిగింది.
వి: దక్షిణాది నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో మార్కెట్ బాగానే ఉందని చెప్పవచ్చు. కరోనాతో రకరకాల ఇబ్బందులున్నా ఇక్కడి మార్కెట్లో వృద్ధి రేటు పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లో తక్కువ ధరకే ఇళ్లు అందుబాటులో ఉండడంతో ఇక్కడ ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దానికి అనుగుణంగానే తమ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఇక్కడికి ఉత్తర భారత దేశం నుంచి చాలా మంది ఇక్కడ సొంతంగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. సుమారు 5 శాతం వరకు ఉంటున్నారని చెప్పవచ్చు.