హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీ హబ్ ఫౌండేషన్ ప్రత్యేకంగా మూడు నెలలపాటు ఇంక్యూబేషన్ ప్రోగ్రామ్ వీ రిచ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పాల్గొని ప్రారంభించారు.
ఆలోచనల స్థాయి నుంచి వ్యాపారం వరకు కావాల్సిన అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ వీ రిచ్ కింద ఎంపిక చేసిన 60 మంది మహిళలకు మెంటార్షిప్, డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత, ప్రాక్టికల్ వర్క్ షాప్స్, ఎక్స్పోజర్ విజిట్ వంటి అంశాలపై 3 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వీ హబ్ ఫౌండేషన్ సీఈవో సీత పల్లచొల్ల తెలిపారు.