హైదరాబాద్: గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన పొటాషియం క్లోరైడ్ ఔషధానికి అమెరికా హెల్త్ రెగ్యులేటరీ అనుమతినిచ్చింది. హైపోకలేమియా(తక్కువ రక్త హీనత)వ్యాధిని నియంత్రించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతున్నది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ఎఫ్డీఏ) నుంచి పొటాషియం క్లోరైడ్ ఓరల్ సొల్యుషన్స్కు అక్కడి మార్కెట్లోకి విడుదల చేయడంతోపాటు విక్రయించడానికి అనుమతి లభించినట్లు సంస్థ వెల్లడించింది.