Trump Tariffs | వాషింగ్టన్, ఏప్రిల్ 12: ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెనుకడుగు వేశారు. ఇప్పటికే సుంకాల అమలు 90 రోజులపాటు వాయిదావేసిన ట్రంప్..తాజాగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మినహాయింపునిచ్చారు. వీటిలో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్‌లు, మెమొరీ చిప్‌లు, సెమికండక్టర్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ టీవీ డిస్ప్లేలు ఉన్నాయి. ఈ మేరక అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో మొబైళ్లు, ల్యాప్‌టాప్ ధరలు పెరిగే అవకాశాలు లేవు. చైనా మినహా మిగిలిన దేశాలపై వేసిన సుంకాలను వేయడంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనా ఇటీవల నెలకొన్నది. దీంతో ఈ ధరలు పెరిగే అవకాశాలు లేవు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. కానీ ఈ మినహాయింపులు ప్రస్తుత ఎలక్ట్రానిక్స్ సరఫరా అత్యధికంగా ఆసియా దేశాల్లోనే ఉన్నదని, దీనిని అమెరికాకు మార్చడం అంత సులువుకాదని గుర్తించిన ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, చైనాపై ప్రతీకార సుంకాలను 145 శాతానికి సవరించారు. దీనికి పోటీగా చైనా కూడా 125 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
యాపిల్, సామ్‌సంగ్‌లకు లాభం
ఈ నిర్ణయంతో అంతర్జాతీయ సంస్థలైన యాపిల్, సామ్‌సంగ్‌లకు భారీ ఊరట లభించనట్టు అయింది. గత కొన్ని రోజులుగా వీటి ధరలు భారీగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసిన కొనుగోలుదారులకు శుభవార్తను అందించినట్టు అయింది. సమీప భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తం కావడంతో అమెరికా మార్కెట్లో ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి జనాలు ఎగబడ్డారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి టారిఫ్‌ల సెగ: ఐక్యరాజ్యసమితి
అంతర్జాతీయ దేశాల వాణిజ్యానికి టారిఫ్‌ల సెగ గట్టిగానే తగలబోతున్నది. అమెరికా, చైనా, ఇండియా, కెనడా, బ్రెజిల్ వంటి దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలతో అంతర్జాతీయ వాణిజ్యం మూడు శాతం మేర పడిపోయే ప్రమాదం ఉన్నదని ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హెచ్చరించారు. ట్రంప్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో దీర్ఘకాలికంగా గ్లోబల్ ట్రేడ్ మూడు శాతం మేర పడిపోనున్నదని, అలాగే వాణిజ్య విధానాలు, ఆర్థిక ఏకీకరణలో గణనీయమైన దీర్ఘకాలిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు మెక్సికో ఎగుమతులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుండగా… అమెరికా, చైనా, యూరప్, లాటిన్ అమెరికా దేశాల ఎగుమతులపై మధ్యస్థాయిలో ప్రభావం పడనున్నదని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచంలో రెండో అతిపెద్ద దుస్తుల ఎగుమతి దేశమైన బంగ్లాదేశ్‌పై 37 శాతం ప్రతీకూర సుంకాలు విధించడంతో 2029 నాటికి ఏటా 3.3 బిలియన్ డాలర్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశాలున్నాయి.
సుంకాల మినహాయింపునిచ్చిన ఉత్పత్తులు