న్యూఢిల్లీ, ఆగస్టు 1: యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో జూలై నెలలోనూ రూ.29.9 లక్షల కోట్ల స్థాయిలో లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలోనూ రూ.29.9 లక్షల కోట్ల స్థాయిలోనే జరిగాయి. ఎన్పీసీఐ నివేదిక ప్రకార ం జూలై నెలలో యూపీఐ లావాదేవీల పరిమాణం 2,366 కోట్ల లావాదేవీలు జరుగగా, ఇది మే నెలలో జరిగిన 2320 కోట్ల లావాదేవీల కంటే అధికం.
ఏడాది క్రితం రూ. 25.08 లక్షల కోట్లుగా జరిగిన లావాదేవీలు..ఈసారి జూలై నెలలో రూ.29.88 లక్షల కోట్లకు పెరిగాయ ని తెలిపింది. వార్షిక వృద్ధి రేటు 19 శాతంగా ఉన్నది. కరెన్సీ వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రో త్సహించడానికి కేంద్ర ప్ర భుత్వం తీసుకుంటున్న చర్యలు స త్ఫలితాలను ఇస్తున్నాయని, ప్రతి నెలలో రి కార్డు స్థాయిలో జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.