Union Budget 2024 | 23న కేంద్ర బడ్జెట్.. ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుక
Union Budget 2024 | ఈ నెల 23న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో సంప్రదాయ హల్వా వేడుక నిర్వహించారు.
Union Budget 2024 | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న బడ్జెట్ ను పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో ఢిల్లీలోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయం ‘నార్త్ బ్లాక్’లో సంప్రదాయ హల్వా వేడుక నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అధికారులందరికీ స్వయంగా హల్వా వడ్డించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితోపాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రతిఏటా పార్లమెంటులో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించే వరకూ సుమారు 10 రోజులు ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలోనే ఉంటారు. వారికి ఇక్కడే వసతి కల్పిస్తారు. బంధువులకు, కుటుంబ సభ్యులకు కూడా సిబ్బంది ఫోన్ చేసుకునే అవకాశం ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలోనే మాట్లాడాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Hyundai Exter CNG | సీఎన్జీ వేరియంట్లో ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ.. రూ.8.5 లక్షల నుంచి షురూ..!
MG Motor CUV EV | టాటా కర్వ్.ఈవీకి పోటీగా ఎంజీ సీయూవీ ఈవీ.. లాంచింగ్ ఎప్పుడంటే..?!
Realme GT 6T | కొత్త కలర్ ఆప్షన్ లో రియల్ మీ జీటీ 6టీ.. 20 నుంచి సేల్స్ షురూ..!
iQoo Z9 Lite 5G | ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ జడ్9 లైట్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

