Union Budget | బడ్జెట్లో మినహాయింపులుంటాయా..? సెక్షన్ 80సీ, 80డీలో మార్పులు జరిగేనా..?
Union Budget 2024 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పించనున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతూ వస్తున్నది.
Union Budget 2024 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పించనున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతూ వస్తున్నది. మోదీ 3.O ప్రభుత్వంపై ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతనజీవులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఏమైనా ఉపశమనం కల్పిస్తారా? లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పన్ను స్లాబ్‌లో తగ్గింపులు, మినహాయింపుల్లో గణనీయంగా ఏమీ మార్పులు కనిపించలేదు. ఈ క్రమంలో సారైనా పన్ను శ్లాబ్‌లలో మార్పులను ఆశిస్తున్నారు.
దీంతో బడ్జెట్లో సెక్షన్ 80సీలో మార్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద, సుకన్య సమృద్ధి యోజన, ఈపీఎఫ్, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ మొదలైన పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఈ సారి బడ్జెట్లో రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు మినహాయింపులను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులకు భారీ ప్రయోజనం చేకూరనున్నది. గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను చట్టంలోని 80సీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ఈ క్రమంలో గతకొంతకాలంగా పన్ను మినహాయింపులు పెంచాలనే డిమాండ్ ఉన్నది. బడ్జెట్‌కు ముందు జరిగిన భేటీల్లో 80సీ కింద మినహాయింపులు పెంచాలని సీఏ ఇన్స్టిట్యూట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిమాండ్ చేశాయి. ఇదే కాకుండా 80డీ కింద ఆరోగ్య బీమాపై ప్రీమియంపై పన్నును కూడా రెట్టింపు చేసే అవకాశం ఉన్నది. 80డీలో కొద్ది సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు జరుగలేదు. ఈ సెక్షన్‌లోనూ మినహాయింపులను పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రికి వినతులు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఆరోగ్య బీమా ప్రీమియం ప్రతి ఏటా 10-25 శాతం చొప్పున పెరుగుతుండడం గమనార్హం. పన్ను చెల్లింపుదారుల కోరిక మేరకు కేంద్రం బడ్జెట్లో ఈసారి మినహాయింపులు ఇస్తుందా? లేదా? మరో రెండురోజుల్లో తేలిపోనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

