న్యూఢిల్లీ, జనవరి 20: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. అక్టోబర్-డిసెంబర్లో బ్యాంక్ రూ.2,245 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో నిరుడు రూ.1,085 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది.
2021-22లో రూ.19, 454 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.24,154 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 11.62 శాతం నుంచి 7.93 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 4.09 శాతం నుంచి 2.14 శాతానికి దిగొచ్చాయి.