నిత్యం విమాన ప్రయాణాలు చేసే వారి కోసం ప్రముఖ క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబెర్ (Uber) స్పెషలైజ్డ్ ఫీచర్లు తీసుకొచ్చింది. వేసవిలో ప్రయాణాల రద్దీని పరిగణనలోకి తీసుకున్న ఉబెర్.. ఈ ఫీచర్లు పరిచయం చేసింది. ఇందుకోసం 90 రోజులు ముందే ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన విమానాశ్రాయాల వద్ద తమకు పికప్ పాయింట్లు, పార్కింగ్ స్లాట్లు ఉన్నాయని తెలిపింది. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి వారికి ప్రయాణం మరింత సౌకర్యవంతం చేయడానికి ఈ ఫీచర్లు తెచ్చామని పేర్కొంది.
ప్రయాణికులు ఎయిర్పోర్ట్ గేటు నుంచి ఉబెర్ క్యాబ్ పికప్ జోన్‌కు చేరుకోవడానికి కొత్త ఫీచర్ తెచ్చింది. ఈ ఫీచర్‌ను విమానాశ్రయ చిత్రాలతోపాటు రూపొందించారు. ఇందులో ప్రయాణికులు ఎలా వెళ్లాలో తెలుస్తుంది. దేశంలో రద్దీగా ఉండే 13 విమానాశ్రయాల పరిధిలో ఈ ఫెసిలిటీ తీసుకొచ్చామని వివరించింది. అంతే కాదు విమానాశ్రయంలో ఫ్లయిట్ దిగినప్పటి నుంచి పికప్ జోన్‌కు వెళ్లడానికి పట్టే దూరం, నడవడానికి ఎంత టైం పడుతుందో కూడా యాప్ డిస్ప్లేపై కనిపిస్తూ ఉంటుంది.
అంతే కాదు.. విమాన ప్రయాణికులు తమ ఈ-మెయిల్‌ను ఉబెర్ యాప్‌తో సింక్ చేసుకునే మరో ఫెసిలిటీ తీసుకొచ్చింది. దీంతో బుకింగ్ టైం చాలా ఆదా అవుతుందన్నది. ముందే తేదీ, టైం అందులో తెలియ జేయడం వల్ల చివరిక్షణంలో విమానాశ్రయానికి వెళ్లేందుకు టికెట్ బుకింగ్ కోసం ఇబ్బంది ఉండదని వెల్లడించింది. విమానాశ్రయాల వద్ద ఉబెర్ తన డ్రైవర్లకు కూడా వెసులుబాటు కల్పించే ఫీచర్లు తీసుకొచ్చింది.