Smuggled Gold | ఇద్దరు అబుదాబీ ప్రయాణికుల నుంచి స్మగుల్డ్ బంగారం జప్తు.. అరెస్ట్..!
Smuggled Gold | అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.
Smuggled Gold | అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. సదరు ప్రయాణికులు ఇద్దరు అబుదాబీ నుంచి విమానంలో ముంబై విమానాశ్రయంలో దిగారు. వారు వ్యాక్స్ ఫామ్లో 4.52 కిలోల బంగారం డస్ట్ రూపంలో తీసుకొచ్చారు. విమానాశ్రయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ సంగతి తేలింది. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా విదేశాల నుంచి బంగారం తీసుకొస్తున్నందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు చెప్పారు. ఈ బంగారం విలువ రూ.3.33 కోట్లు ఉందని సమాచారం.
తమకు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కస్టమ్స్ గ్రీన్ చానెల్ దాటేసిన తర్వాత వారిని తనిఖీ చేశామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. వారివద్ద వ్యాక్స్ ఫామ్లో ‘గోల్డ్ డస్ట్’ నాలుగు ప్యాకెట్లలో విదేశీ బంగారం దొరికింది. ప్యాసింజర్లు టైలర్ తయారు చేసిన జాకెట్ లో ప్యాకేట్లు కుట్టించారు. అబుదాబీలో ఒక ప్రయాణికుడు వీరికి ఈ బంగారం అందజేశాడని డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశామని డీఆర్ఐ అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Redmi A3x | రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఏ3ఎక్స్.. ధరెంతంటే..?!
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!
Kia India | కియా ఇండియా నుంచి రెండు ప్రీమియం కార్లు.. అక్టోబర్ 3న లాంచింగ్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

