BMW X3 | కాలుష్య నియంత్రణకు కార్ల తయారీ సంస్థలన్నీ డీజిల్ వేరియంట్ల తయారీ నిలిపేస్తున్నాయి. ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్ కార్లు సైతం తప్పిస్తున్నాయి. ఈ తరుణంలో జర్మనీ ఆటో మేకర్ బీఎండబ్ల్యూ డీజిల్ వేరియంట్ కార్లను తీసుకొచ్చింది. దేశీయ మార్కెట్లోకి రెండు `ఎక్స్3` ఎస్యూవీ వేరియంట్ (BMW X3 SUV) ఆవిష్కరించింది. ఎక్స్3 ఎక్స్ డ్రైవ్ 20డీ ఎక్స్ లైన్ (X3 xDrive20d xLine), ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డీ ఎం స్పోర్ట్ (X3 xDrive20d M Sport) ఆవిష్కరించింది. ఎక్స్3 ఎక్స్ డ్రైవ్ 20 డీ ఎక్స్లైన్ ధర రూ.67.5 లక్షలు, ఎక్స్3 ఎక్స్ డ్రైవ్ 20డీ ఎం స్పోర్ట్ ధర రూ.69.9 లక్షలుగా నిర్ణయించారు. రెండు డీజిల్ వేరియంట్ కార్లు దేశవ్యాప్తంగా బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌ల వద్ద లభిస్తాయి. ఎక్స్3 డీజిల్ కార్లు కంఫర్ట్, ఎకో ప్రో, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్ల్లో అందుబాటులో ఉంటాయి.
ఎక్స్3 సిరీస్ ఎస్యూవీ వేరింట్ కారులో లార్జ్ యాంగ్యులర్ కిడ్నీ గ్రిల్లే విత్ వెర్టికల్ ఎయిర్ ఇన్లెట్స్ ఫీచర్ జత చేశారు. ఈ కారులో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా పొందొచ్చు. వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ లభిస్తుంది.
ఎం-స్పోర్ట్ వేరియంట్లో అదనంగా బీఎండబ్ల్యూ కిడ్నీ ఫ్రేమ్, బార్స్, సైడ్ ప్యానెల్స్, హై గ్లోస్ బ్లాక్‌లో టెయిల్ పైప్స్, స్పెసిఫిక్ ఫ్రంట్ ఆప్రోన్ విత్ లార్జర్ ఎయిర్ ఇన్‌టేక్, అండ్ ఇన్సర్ట్స్ ఇన్ గ్లోస్ క్రోమ్‌లో లభిస్తాయి. 19-అంగుళాల వై-స్పోక్ 887 ఎం అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.
న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ గెస్చర్ కంట్రోల్స్, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో, 12.3-అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ 3డీ నావిగేషన్ కూడా వస్తుంది.
మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, హర్మాన్ కార్డోన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, అంబియెంట్ లైటింగ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సీట్స్ విత్ మెమరీ ఫంక్షన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎం-స్పోర్ట్ వేరియంట్లో స్పోర్ట్ సీట్స్, ఎం-లెదర్ స్టీరింగ్ వీల్, ఎం ఇంటీరియర్ ట్రిమ్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్3 డీజిల్ కారు 2.0 లీటర్ల టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 190 హెచ్‌పీల విద్యుత్, 400 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్నది. న్యూ ఎక్స్3 కారు కేవలం 7.9 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా గంటకు 213 కి.మీ. స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.
ఆరు సిక్స్ బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఐఎస్వో ఫిక్స్ చైల్డ్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో న్యూ ఎక్స్3 కార్లు రూపుదిద్దుకున్నాయి.