హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫారెస్ట్ ఏఐ గ్రాండ్ చాలెంజ్‌కు 12 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్, నాస్కాం ఫౌండేషన్, క్యాప్ జెమిని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు వన్య ప్రాణులను రక్షించడమే లక్ష్యంగా వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఈ చాలెంజ్‌ను నిర్వహించారు. మొత్తం 60 దరఖాస్తులు రాగా అందులో అత్యుత్తమైన 12 స్టార్టప్‌లను ఎంపిక చేశారు.