TVS Raider Super Squad | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. దేశీయ మార్కెట్లోకి తన రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (TVS Raider Super Squad Edition) బైక్ తీసుకొచ్చింది. మార్వెల్ సూపర్ హీరో స్పూర్తిగా తీసుకొచ్చిన ఈ బైక్ రెండ్ థీమ్ వేరియంట్లు – బ్లాక్ పాంథర్, ఐరన్ మ్యాన్ వేరియంట్లలో ప్రవేశ పెట్టింది. దీని ధర రూ.98,919 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. అన్ని టీవీఎస్ మోటార్ టచ్ పాయింట్లలో న్యూ టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (TVS Raider Super Squad ) లభిస్తుంది.
తొలుత 2021లో రైడర్ బైక్ ఆవిష్కరించింది. న్యూ టీవీఎస్ రైడర్ బైక్ (TVS Raider Super Squad Edition).. బజాజ్ పల్సర్ 125 బైక్‌తో పోటీ పడుతుంది. రెండు కలర్ ఆప్షన్లలో టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ స్పెషల్ ఎడిషన్ లభిస్తుంది. ఐరన్ మ్యాన్ గ్రాఫిక్స్ విత్ ఫస్ట్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, గ్రాఫిక్స్ బ్లాక్ పాంథర్ థీమ్ విత్ సెకండ్ బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కలిగి ఉంటుంది.
మార్వెల్ సూపర్ హీరో స్పూర్తిగా టీవీఎస్ మోటార్ తీసుకొచ్చిన రెండో మోటార్ సైకిల్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (TVS Raider Super Squad Edition). ఇంతకుముందు థోర్, ఐరన్ మాన్, బ్లాక్ పాంథర్, స్పైడర్ మ్యాన్ స్ఫూర్తితో ఎన్‌టార్క్ స్కూటర్ నాలుగు కలర్ థీమ్స్‌లో తెచ్చింది. ఈ బైక్ 2070 ఎంఎం పొడవు, 785 ఎంఎం వెడల్పు, 1028 ఎంఎం ఎత్తుతోపాటు 1326 ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంటుంది.
టీవీఎస్ రైడర్ స్క్వాడ్ స్పెషల్ ఎడిషన్ (TVS Raider Super Squad Edition) మోటారు సైకిల్.. వెరీ స్పోర్టీ లుక్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్, అగ్రెసివ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తదితర ఫీచర్లతో డిజైన్ చేశారు. మస్క్యులర్ ఫ్యుయల్ ట్యాంక్ విత్ స్ప్లిట్ సీట్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఎట్ రేర్, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తోపాటు రేర్ మోనో షాక్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.
టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (TVS Raider Super Squad Edition) బైక్ 124.8సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7500 ఆర్పీఎం వద్ద 11.2 బీహెచ్పీ విద్యుత్, 6000 ఆర్పీఎం వద్ద 11.2 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో పని చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ పాసివ్ స్టార్ట్/ స్టాప్ సిస్టమ్, నాయిస్ లెస్ మోటార్ స్టార్టర్ టెక్నాలజీతో వస్తుంది. దీనివల్ల ఫ్యుయల్ మైలేజీ పెరుగుతుంది. ఈ బైక్ ఫ్యుయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు ఉంటుంది.