హైదరాబాద్, డిసెంబర్ 19 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్..విద్యుత్‌తో నడిచే వాహన పరిధిని మరింత విస్తరించడానికి మరో ఈ-స్కూటర్‌ను పరిచయం చేసింది. టీవీఎస్ ఆర్బిటర్ పేరుతో విడుదల చేసిన ఈ వాహనం సింగిల్ చార్జింగ్ 158 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 3.1 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన ఈ వాహనం ధర రూ.1,04,600గా నిర్ణయించింది.
34 లీటర్ల బూట్‌స్పేస్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, కనెక్టింగ్ మొబైల్ యాప్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, యూఎస్బీ 2.0 చార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మొబైల్ యాప్‌తో బ్యాటరీ చార్జింగ్, ఓడోమీటర్‌ను రిమోట్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కాల్స్, ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు కూడా.