బెంగళూరు, నవంబర్ 7: ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆటోను పరిచయం చేసింది. టీవీఎస్ కింగ్ డ్యూరామాక్స్ ప్లస్ పేరుతో విడుదల చేసిన రెండు మాడళ్లు సీఎన్జీ, పెట్రోల్ రకాల్లో లభించనున్నది. 225 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ ఆటోలో సీఎన్జీ రకం ధర రూ.2,57,190, పెట్రోల్ రకం రూ.2,35,552 నిర్ణయించింది. ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా టీవీఎస్ బిజినెస్ హెడ్ రజత్ గుప్తా మాట్లాడుతూ..కస్టమర్లకు నూతన వాహనాలు అందించడంతో తాము పెట్టుకున్న కమిట్మెంట్కు ఈ వాహనం నిదర్శణమని, ఇన్నోవేషన్, కస్టమర్లకు అధిక ప్రయోజనాలు కల్పించడానికి ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించినట్టు చెప్పారు.