హైదరాబాద్, ఆగస్టు 27: టీవీఎస్ మరో మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. 110 సీసీ సామర్థ్యంతో రూపొందించిన జూపిటర్ సరికొత్త వెర్షన్ ధర రూ.77 వేలు ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఈ ధరలు హైదరాబాద్ షోరూంనకు సంబంధించినవి.
రాష్ట్రంలో స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధా హల్దార్ తెలిపారు. స్మార్ట్ కనెక్టివిటీలో భాగంగా బ్లూటూత్‌తో కాల్, ఎస్ఎంఎస్, నావిగేషన్, వాయిస్ అసిస్ట్ చేసుకోవచ్చును. 4 స్ట్రోక్ 113.3 సీసీ ఇంజిన్, సింగిల్ సిలిండర్, యూఎస్బీ మొబైల్ చార్జర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.