చెన్నై, జూలై 2: ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్ ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది. హిల్ హోల్డ్ అసిస్ట్, 3.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 123 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
ఇప్పటికే ఐక్యూబ్ మాడల్ 6 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ కొత్త వేరియంట్ ప్రతిరోజు ప్రయాణించడానికి అనుకూలంగా రూపొందించింది. డ్యూయల్ టోన్ కలర్స్, బ్యాక్‌రెస్ట్, బ్యాటరీ కెపాసిటీని అప్‌గ్రేడ్ చేసి ఈ మాడల్‌ను అభివృద్ధి చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.