హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్‌కు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ యువతను శిక్షణనిచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
సిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.