TRAI | న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఫీచర్ ఫోన్ యూజర్లు, వయో-గ్రామీణ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్.. సోమవారం టారీఫ్ రూల్స్‌ను సవరించింది. దీంతో ఇకపై వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన రిచార్జ్ వోచర్లను టెలికం సంస్థలు తప్పక అందుబాటులోకి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా రకరకాల డాటా ప్లాన్లను టెలికం కంపెనీలు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బండిల్డ్ ప్లాన్లలోనే అపరిమిత వాయిస్ కాల్స్‌ను, రోజుకిన్ని (100) ఎస్ఎంఎస్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే డాటా వాడుకోని కస్టమర్లకు ఈ ప్లాన్లు భారంగా పరిణమించాయి. కాగా, రూ.10తోపాటు ఇతర డినామినేషన్లలో వాయిస్, ఎస్ఎంఎస్ వోచర్లనూ కొనసాగించాలని కంపెనీలకు ట్రాయ్ సూచించింది.