Toyota Hilux | అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టయోటా హిలక్స్ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్.. ఆవిష్కరణ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. ఆసక్తిగల ఖాతాదారులు ఆథరైజ్డ్ టయోటా డీలర్ల వద్ద రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించి ప్రీ-బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. దీని ధర రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఉండొచ్చునని అంచనా. ఇది ఇసుజు డీ-మాక్స్, వీ-క్రాస్‌లతో పోటీ పడనున్నది. అంతే కాదు.. హిలక్స్, హిలక్స్రియో వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కొన్ని విడి భాగాలను దిగుమతి చేసుకుని దేశీయంగా బిదాడీ యూనిట్లో అసెంబ్లీంగ్ చేస్తారని సమాచారం.
హిలక్స్ 2.8 లీటర్ల టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో రూపుదిద్దుకుంటుందని వినికిడి. ఈ ఇంజిన్‌కు 204 బీహెచ్పీతోపాటు 500 ఎన్ఎం టార్చి వెలువరించే సామర్థ్యం ఉంటుందని తెలుస్తుంది. 6-స్సీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ వర్షన్లలో వస్తున్నది. ఫ్రంట్ భాగం ఫార్చ్యూరన్ను పోలి ఉంటుందని సమాచారం. ఫార్చ్యూనర్ ఇండియా మోడల్లోని డాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్స్, సీట్స్‌తోపాటు 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తదితర ఫీచర్లు జత కలుస్తాయని భావిస్తున్నారు.