Crypto Currency | గత 24 గంటల్లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 132.29 బిలియన్ డాలర్లకు చేరింది. గతవారంతో పోలిస్తే ఈ వారం క్రిప్టో కరెన్సీలు 4.52 శాతం లబ్ధి పొందాయి. దీంతో గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ఎం-క్యాప్ 2.47 లక్షల కోట్ల డాలర్లకు చేరువలో ఉన్నది. శనివారం ట్రేడింగ్‌లో ఒకానొకదశలో 2.5 లక్షల కోట్ల డాలర్లను దాటేసింది. గత మే నెల 12న మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.54 లక్షల కోట్ల డాలర్ల గరిష్ట స్థాయికి చేరింది.
గత ఏప్రిల్‌లో 64,895 డాలర్లతో ఆల్‌టైం గరిష్ఠ రికార్డు నమోదు చేసింది బిట్ కాయిన్. కానీ తర్వాత 53 శాతం పతనమైంది. క్రిప్టో కరెన్సీపై చైనా నియంత్రణలు.. టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ వ్యాఖ్యలతో ఒక దశలో బిట్ కాయిన్ విలువ 30 వేల డాలర్లకు చేరుకున్నది. తిరిగి పుంజుకున్నది. తాజాగా గత ఏడు రోజుల్లో సుమారు 11 శాతం బిట్ కాయిన్ విలువ పెరిగింది.