హైదరాబాద్, మే 9:దేశంలో తొలి ఎలిక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీ సంస్థ టర్క్ మోటర్స్..తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లో తన తొలి అవుట్‌లెట్‌ను కూకట్‌పల్లిలో మంగళవారం ప్రారంభించింది.
2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌లో అన్ని రకాల బైకులను అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఫౌండర్, సీఈవో కపిల్ శేల్క్ తెలిపారు. క్రటోస్ ఆర్ మాడల్ ధర రూ.1,68,374గా నిర్ణయించింది.