Maruthi Alto & Dzire | గత నెలలో అమ్ముడైన కార్లలో మారుతి మరోమారు ఆధిపత్యం ప్రదర్శించింది. హ్యాచ్‌బ్యాక్ క్యాటగిరీలో ఆల్టో, సెడాన్ మోడల్ కార్లలో డిజైర్ ఎక్కువగా అమ్ముడైంది. కస్టమర్లను ఆకర్షించడంలో మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ కారు కూడా సక్సెస్ అయ్యింది. వివిధ క్యాటగిరీల్లో కార్ల సేల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో నాలుగు మారుతి సుజుకి కార్లకు కొనుగోలు దారులు ప్రాధాన్యం ఇచ్చారు. అత్యధికంగా అమ్ముడైన టాప్-5 మోడల్స్‌లో మారుతి సుజుకిదే ఫస్ట్ ప్లేస్. ఇక హ్యుండాయ్ గ్రాండ్ 10 నియోస్ మోడల్ కార్లు 6,042 యూనిట్లు అమ్ముడు కావడంతో టాప్-5 ర్యాంక్ పొందింది. గత నెలలో అమ్ముడైన బెస్ట్ కారుగా మారుతి సుజుకి ఆల్టో నిలుస్తుంది. 2021 అక్టోబర్‌లో 17,389 ఆల్టో మోడల్ కార్లు అమ్ముడయ్యాయి.
కానీ ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది కార్ల సేల్స్ 2.5 శాతం తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో మారుతి బాలెనో మోడల్ కార్లు 15,573 యూనిట్లు అమ్ముడై రెండో స్థానంలో నిలిచింది. మరో మారుతి సుజుకి మోడల్ కారు వాగనార్ గతేడాది 18,703 యూనిట్లు అమ్ముడైనా.. ఈ ఏడాది 12,335 యూనిట్లకే పరిమితం అయ్యాయి.
సెడాన్ సెగ్మెంట్లో 8077 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. హోండా సిటీ 3,611 యూనిట్లు, హోండా అమేజ్ 3009, హ్యుండాయ్ ఔరా 2,701 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక మ్యుండాయ్ వెర్నా 12.56 శాతం గ్రోత్తో టాప్5లో నిలిచింది.
ఇటీవల ఆవిష్కరించిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారుకు కూడా మంచి స్పందన ఉంది. మిడ్ ఎస్యూవీస్లలో టాప్-5 మోడల్ కారుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 నిలిచింది. మరోవైపు టాటా హరియర్ 3097, ఎంజీ హెక్టార్ 2,478, టాటా సఫారీ 1,735, అల్కాజర్ 1,392 యూనిట్లు సేల్ అయ్యాయి.