Reliance | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో మూడు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.73,630 కోట్లు కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయిన స్క్రిప్ట్ల్లో ఉన్నాయి. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ లబ్ధి పొందాయి. ఏడు సంస్థలు కూడా రూ.49,441.05 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే పెంచుకున్నాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 179.95 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 52.80 పాయింట్లు లాభాలతో ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,100.95 కోట్లు నష్టపోయి రూ.16,29,684.50 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,654.2 కోట్లు కోల్పోయి రూ. 4,89,700.16 కోట్లతో సరిపెట్టుకుంది. ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.4,875.41 కోట్లు పతనమై రూ.5,36,364.69 కోట్ల వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,172.88 కోట్ల లాభంతో రూ.6,21,907.38 కోట్లకు చేరుకున్నది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.11,200.38 కోట్లు వృద్ధి చెంది రూ.4,16,690.11 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,519.12 కోట్లు జత కలిసి రూ. 4,28,044.22 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.8,489 కోట్ల లాభంతో రూ.12,13,396.32 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,924.46 కోట్లు వృద్ధి చెంది రూ.4,01,114.96 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,043.49 లాభ పడి రూ.3,69,833.12 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.91.72 కోట్లు లాభ పడి రూ. 7,51,892.03 కోట్లకు చేరుకున్నది.