MUVI 125 4G | లాప్‌టాప్‌లు, కంప్యూటర్ హార్డ్‌వేర్ తయారీకి పెట్టింది పేరు ఎసేర్ (Acer). ఈ కంపెనీ వ్యూహాత్మకంగా భారత్ ఎలక్ట్రికల్ వాహన మార్కెట్లో ఎంటరవుతున్నది. భారత్‌లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ – ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ (MUVI 125 4G) స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. త్వరలో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. రూ.999 చెల్లించి ఎంయూవీఐ125 4జీ (MUVI 125 4G) స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. మిగతా రూ.99 వేలు డెలివరీ సమయంలో పే చేయాలి. స్కూటర్ తయారీ కోసం భారత్ అర్బన్ మొబిలిటీ స్టార్టప్ థింక్ ఈబైక్‌గో (Think eBikeGo)తో జాయింట్ వెంచర్ ప్రారంభించింది ఎసెర్. స్కూటర్ డిజైన్ రూపకల్పన, తయారీ బాధ్యతను థింక్ ఈబైక్‌గో (Think eBikeGo) చేపట్టింది.
ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ (Acer MUVI125 4G) ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 80 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ ఈవీ స్కూటర్ సామర్థ్యం. రోజువారీగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, రోజువారీగా ప్రయాణం చేసే వారికి ప్రత్యేకించి భవిష్యత్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి పరిష్కారంగా ఎసెర్ ఎంయూవీఐ125 4జీ (Acer MUVI125 4G) స్కూటర్ నిలుస్తుంది. ఈ ఈ-స్కూటర్ ఉపయోగకరంగా ఉంటుంది. హైపర్ లోకల్ ఫుడ్ డెలివరీ లేదా గ్రాసరీ డెలివరీ, బిజినెస్ 2 బిజినెస్ అవసరాలకు ఉపకరిస్తుంది.
లైట్ వెయిట్ చేసిస్, 16-అంగుళాల వీల్స్, స్వాపబుల్ బ్యాటరీ ఫెసిలిటీతో తేలిగ్గా చార్జింగ్కు వెసులుబాటు కలిగి ఉంటుందీ ఈ బైక్. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్సిడీలకు ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ స్కూటర్ అర్హత కలిగి ఉంటుంది. భవిష్యత్‌లో పలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్ వెహికల్స్ తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్, ఎథేర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ తదితర కంపెనీల ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు ఎసెర్ ఎంయూవీఐ125 4జీ (Acer MUVI125 4G) ఈ-స్కూటర్ పోటీనిస్తుంది. బ్లూటూత్ ఎనేబుల్ 4-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ విత్ త్రీ కాన్ఫిగరేషన్స్, ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ బేస్డ్ స్మార్ట్ ఫోన్లతో రైడర్లు తేలిగ్గా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్‌లో రౌండ్ షేప్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, 16-అంగుళాల 7 స్పోక్ అల్లాయ్ వీల్స్, కంఫర్టబుల్ రైడింగ్ కోసం ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, రేర్‌లో మోనోషాక్ అబ్జార్బర్ ఉంటాయి. మూడు రంగులు – పొలార్ వైట్, కార్బన్ బ్లాక్, గ్లాసియర్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది.